Wednesday 10 December 2014

నీ ధ్యాసలో నేనుంటినా...
నీ లాగే నేనయితినా...
కబురీయవా కను సైగతో
కవ్వించవా నీ నవ్వుతో ..
ఎందుకో ఏమో ఈ కోరిక
కలలోనైన తీరేది కాదు కదా!
నీ ఒడి, నిదురలో పానుపు కావాలని ...
నీ నీడ, చీకటిలో కూడా నను చేరాలని...
నీ తలపే, కనులలో ఆనందం నింపాలని ..
నీ అడుగలలో నేనే నీకై నిలవాలని ....
తడబడే పెదాల వెనుక,
        వెచ్చని నీ ఊపిరి దాగుండాలని..
కటినమైన నీ  చూపు చాటున,
        నన్నిష్టపడే మనసు ఉండాలని....
విలపించే నా హృదయాన్ని ,
         నీ మేని కౌగిలింతలో బందీని చేయాలనీ ...
నా ఈ రేపటి  ఆశకు,
         వెలుగు కిరణం నువ్వే కావాలని ...
                             ఓ కన్నీటి కల ...

Friday 17 October 2014

మరణం మనిషిని చూసి నవ్వుతుంది ..
తన నుంచి తప్పించుకోలేమని ..
నువ్వు నా పక్కనుంటే మరణం భయపడుతుంది,
నా చేరువలో రావడానికి ...
మరణిస్తానని తెలిసినా మనసు కోరుకుంటుంది ,
నీకై చిరునవ్వు చిందించాలని...
నీతో గడిపే రెండు క్షణాలు సమయం కోసం,
నా కనులు రెప్ప వెయ్యడం మర్చిపోయాయి ..
నీ బాహువులలో జీవితాంతం ఒదిగిపోవడం కోసం,
నా ఆలోచనల అంతరంగాలు మారిపోతున్నాయి ..
నీవు కరుణించవు అని తెలిసినా,
నా కనులు కలలని వదలడం లేదు...
నీ మోము సౌందర్యం చూచి జాబిలి చిన్నబోదా !
నీ కనుల వెలుగు ముందు వెన్నెల వెలవెలబోదా !
నీ పెదవుల పలుకులు విని కోయిల ఆశ్చర్యపోదా !
నీ ఆదరాల ఎరుపు చూసి సూర్యుడు విస్తుపోడా !
నీ అందమైన చిరునవ్వుకని వసంతం వచ్చిపోదా !
నీ కురుల నలుపు చూసి చీకటి రాబోదా !
ఏకాకినై
చీకటి వైపు చూస్తుంటే
గాలి లోని వెలుగువలె
స్నేహం మిణుకుమిణుకుమంటుంటే ..
జీవితం ఆలోచనలతో ఊగిసాలడుతుంది...
మనసే ముక్కలై...
నమ్మకం చచ్చిన వేళా,
ఒంటరితనం ఓటమివైపు
అడుగులేస్తుంటే...
మనసేమో విజయం వైపు చూపే
స్నేహానికై ఆరాటపడుతున్నది...

Saturday 11 October 2014

బంధం ....
ఉండాల్సింది మనుషుల మధ్య కాదు ..
అర్ధం చేసుకునే మనసుల మధ్య...
నిను కోరుకునే వాళ్ళు ఎందుకు కోరుతున్నారో
నాకు తెలియదు కానీ..
నేను మాత్రం నువ్వు మాట్లాడితే
నా పెదవులపై మెరిసే చిరునవ్వు కోసం కోరుకుంటున్నా...
నీకు నాకు నడుమున ఏముందో తెలియక పోవచ్చు,
కాని నిను గౌరవించే హృదయం మాత్రం నాలో ఉంది.
నిను పొందే హక్కు నాకు లేకపోవచ్చు కాని
నిను దూరం చేసుకునే ఉద్దేశ్యం మాత్రం నాలో లేదు...
అబద్దం,

బంధాన్ని బలపరుస్తుంది అనుకుంటే ..మనసుని వేధిస్తుంది
మరచిపోగలను అని చెప్పగలను కానీ మరువలేను.
మరచిపోతాను నా శ్వాస ఆగిపోయినపుడు
నీకు దూరం అవ్వాలి అనుకుంటున్నాను ..ఎందుకో తెలుసా
అబద్డంతో ఇమిడి ఉన్న బంధం బీటలు వారిన గోడ లాంటిది
ఏ క్షణాన కూలిపోతుందో తెలియదు
అది చూసి తట్టుకునే అంత  శక్తి నాకు లేదు..
నీలా ఏ భావం లేకుండా బ్రతికే మార్గం కూడా నాకు లేదు ..
అందుకే ఈ దూరం...
ప్రతి చినుకు మేనిపై
నాట్యమాడుతుంటే
తన చేతి స్పర్శలా ఉంది
కలకాదుగా ఇదీ
అతని కౌగిలిలో ఉన్నది ...

Friday 10 October 2014

వర్షం
ఎందుకో తనను దగ్గర
చేసినట్లు అనిపిస్తుంది
కారణాలు ఏవైతేనేం
నాలో ఆనందాలు నింపింది..
అది క్షణమే అని తెలిసిన
నా మనసు ఏదో బంధం
కోసం ఉవ్విలురుతుంది
వాస్తవమో కల్పితమో
మనసుకి హాయిగా ఉంది ...
నీ పెదవుల చిరునవ్వుల
వెనుక నే చిన్న కారణమై
నీ కనుల అందము
చాటున నే ఊహనై..
నీ తేనే మనసు
మాటున నే కోరికై,
వర్షించే నా కనులను నీ
నును వెచ్చని స్పర్శతో
ఆనందింపజేయవా....
సంగమం ..
నీ తనువు నా తనువుతో
మనసులు మాట్లాడుకుంటున్నాయి
మౌనమనే బాషతో
తడబడుతున్నాయి ..
నా అదరాలు నీ ఆదరాల స్పర్శతో
అలసిపోతున్నాయి..
నా కనురెప్పలు నీ కనుల చుంబనంతో ..
పొంగుతోంది ...
వెచ్చని శ్వాస వరద గోదావరిలా...
నీ స్వేదము రుచి ,
ఈ ఆనందపు అనుభూతి తీయనిది...
చిగురించిన తరువు అడిగినే
చిన్ననాటి గురుతులేవని
చెమ్మగిల్లిన కనులు చెప్పెనే
మనసు చాటున దాచినని..
విరబూసిన పూలు జల్లెనే,
కవ్వింతల అక్షింతలు,
చిరుగాలిలో వేడి తెలిపినే
నీ ఊపిరి నా చేరువ అయ్యెనని ....

Wednesday 24 September 2014

చీకటి చిన్ని నవ్వు జల్లి నను ఆహ్వానిస్తుంటే ..
వెలుగు కనురెప్పలను తెరవనియడం లేదు ..
చీకటి నాకు కాటికి దారి చూపిస్తుంటే...
వెలుగు జ్ఞాపకాలను మరువనీయడం  లేదు ..
చీకటి నా తప్పులని పేరుస్తుంటే,
వెలుగు వర్తమానాన్ని నిర్దేశిస్తుంది..
చీకటి నను నన్నుగా చూస్తుంటే
వెలుగు నా అహాన్నీ చూపిస్తుంది.
చీకటి జీవితాన్ని చూపిస్తుంటే
వెలుగు జీవితంలో వర్ణాలు నింపుతుంది..
జీవితమే చీకటి అయితే
వెలుగు నీ పిలుపు అవుతుంది ...
నీ ప్రేమ పొందలేదే అని
నేను బాధపడిన ఆ క్షణాలు,
నీ ఇప్పటి కపట ప్రేమతో,
ఆ బాధను పూరించగలవా ..
నిజమైన ప్రేమ మార్పును కాదు ,
మనసును కోరుకుంటుంది ప్రియా ...!!!
నేను నేనులా ఉన్న క్షణం
నువ్వు నా చెంత లేవు ...
నేను మారిన ఈ క్షణం,
నీకు నేనున్నానంటు నిలిచావు..
ఇది నా మీద ప్రేమయా లేక
నాటకం లాంటి నా జీవితంలో
జీవిస్తున్న నటుడివా...
ప్రేమ...
నువ్వు నా ఎదుట నిలిచినప్పుడు
నీవెవరు అన్నాను ..
మనసు తలుపు తట్టినప్పుడు
పొమ్మని అన్నాను ...
కానీ ఇప్పుడు ..
నిను చేరాలనిపిస్తుంది
నీ మాటల చినుకులలో తడవాలనిపిస్తుంది..
నీ చూపుల రక్షణలో ఉండాలనిపిస్తుంది ..
నీ మేని కౌగిలింతలో బందీనవాలనిపిస్తుంది ..

Sunday 21 September 2014

పెదవులపై చిరునవ్వు అడిగేనే
ఎవరు ఇచ్చెనని,
ఎద చాటు వన్నెలు అడిగినే,
ఈ పరవశం ఎందుకని,
కనుల చాటు ఊహ అడిగినే,
కోరిక చెప్పవెందుకని?
వరదై పొంగుతోంది కన్నీరు
వలచిన నీ కోసం,
వయస్సుతో వచ్చిన అందాలు
వలపులు వెదజల్లుమంటుంటే
వర్షిస్తున్న కనులు అడిగెను
ఎవరికోసమని ..
ఏమని చెప్పను ఈ
హృదయ బాధ
మనసే లేని మనిషికి
మనసిచ్చాననా ???

మిత్రమా ...
నీ మైత్రితో
వర్షిస్తున్న నా కనులకి,
ఆనందాల దరి చూపిస్తావా!
ఆలోచనలతో నా మనసుకి
ఆహ్లాదాన్ని అందిస్తావా !!!
కనులలో ఉన్న నీ రూపము
కన్నీటితో కరిగి పోతుందనుకుంటే
నిలుపనా ఆ కన్నీరు
శాశ్వతంగా నా నయనాలలో
వలచిన హృదయానికి
వర్ణించలేని బాధనిచ్చి
నువ్వు పొందిన సంతోషము
అజరామమా!!!
నీ ఎదుట పడలేక
                  నా మనసిక
లేఖనే రాసింది
               నీ కోసమేగా...
అక్షరాలలోని మృదువైన
               భావమికా....
నీ కనులలో
             వెలుగులేగా...
నీవు చూడగలవా
             నా మనసులోతునిక
నిలుపవా నను నీ
            బాహువులలో త్వరగా !!!

Friday 19 September 2014

పదాలు కరువే అయిన
నీ మీద ప్రేమ తరగనిది...
ఎద లోతుల సవ్వడులు వెతికినా
నాలో ప్రతి జ్ఞాపకం నీది
ఎగసే అలలు ఎంత ఎదిగిన
చివరికి పయనము సంద్రానికే..
నీ మీద కోపం ఒక్క క్షణం అయిన
నా ఎదలోని బాధ కన్నీటి ధార...

Thursday 24 July 2014

నేను ఇష్టపడే నువ్వు...
నాకు అందనంత దూరం వెళ్ళినా...
నీ నుంచి దూరం అయిన నాకు
మిగిలేది కన్నీటి సంద్రమే కదా !
ఆ కన్నీటి తాకిడికి నీ
మనసు కరిగినా...
ముక్కలైన నీ రూపం
తిరిగి నా వైపు చూడలేదు
కదా.. నేస్తమా !!!

'ప్రయాణం'
     పరిణితితో చెందినది..
మలుపులు అనేకం..
పయనం ఒకటే...
ఆలోచనలు అనేకం...
జీవనం ఒకటే...
దారులు వేరు, దరి ఒకటే...
మనసులు వేరు, గమ్యం ఒకటే...
కలువ అందాలు నీ కనుల
                      సొంతమైనా,
వాటి వెనుక దాగున్నది
                      కాఠిన్యమేగా...
నా ఆశ్రువులు సంద్రమై నను
                     ముంచేస్తున్నా,
నీ చూపులు నను తాకవే
                     చెలి....
నా హృదయంలో ప్రవహించే
ఈ ఆలోచనా తరంగాలు,
వరదా వాహినిలా నను,
ముంచేయక ముందే,
నీవు సంద్రమై రావా...
నను సంగామించానీవా !!!
నీవు కలవై నను కవ్విస్తుంటే,
కనులలో ఉన్న నిను కలుసుకునేదెల !
నీ చిరునవ్వు చిరునామాగా వెతికినా,
నీవు నా కంట పడవేలా !
అనుక్షణం నను దహించక,
నా చేరువ కావా ప్రియతమా !!!

Monday 23 June 2014

నీ చూపుల స్పర్శకి
వికసించిన నా మేను
వాడిపోదా ఆ చూపులు
క్షణకాలమే అని తెలిసి....
జీవించేది క్షణమైనా
నీ పూజకి పనికి రానిది
వికసించి కూడా
జీవం లేనిది. . .!!!

Thursday 19 June 2014

నీ నవ్వు నన్ను తాకుతుంది
బంధించిన జ్ఞాపకాలను తెంచడానికి
ని పలుకు నన్ను చేరుతుంది
బరువెక్కిన గుండెని ఓదార్చడానికి
నీ చూపు నన్ను చుట్టేస్తుంది
నాలో ఆశలని రేపడానికి...
నీ స్పర్శ నన్ను ముద్దాడుతుంది
నేను ఉన్న నీకని చెప్పడానికి....!!!

Monday 28 April 2014




నీవు తీయని కలవో ....
       తీరని ఆశవో ....
నిను ఎరిగిన నేనే
       ఎరుకనే ...
నీవు ఉప్పెన అలవో ...
       కన్నీటి తడివో ...
నీ ఆలోచనలే నన్నే
        తాకేనే
    

Thursday 10 April 2014

ప్రేమ చిత్రమైనది....

కావాలి అనుకునప్పుడు చెంత ఉండదు . . 
వద్దు అంటే వెంటే ఉంటుంది . . 

Wednesday 5 March 2014

పోరాటం ....

తెరచాపను తాకుతున్న
చల్లని గాలికి తెలుసా..
తాను ఏ దిశగా,
పయనిస్తుందో ...
నావను నడిపే వారికి తెలుసా..
మరునిముషము ఏమి జరుగుతుందో...
బ్రతుకు పోరాటానికి జాలరులై,
నిండు కుండ లాంటి సముద్రంలో,
నీటి బిందువై కలిసి  పోతున్నారు...
తమ బంధువుల కనులలో,
కన్నీటి ఆశ్రువులవుతున్నారు....
                                                             - Pragma!

Monday 3 March 2014

Have Aim...You Reached It Or Not..But you Tried. It Is 'Worth Enough' Than Reached Your AIM