Wednesday, 24 September 2014

ప్రేమ...
నువ్వు నా ఎదుట నిలిచినప్పుడు
నీవెవరు అన్నాను ..
మనసు తలుపు తట్టినప్పుడు
పొమ్మని అన్నాను ...
కానీ ఇప్పుడు ..
నిను చేరాలనిపిస్తుంది
నీ మాటల చినుకులలో తడవాలనిపిస్తుంది..
నీ చూపుల రక్షణలో ఉండాలనిపిస్తుంది ..
నీ మేని కౌగిలింతలో బందీనవాలనిపిస్తుంది ..

Sunday, 21 September 2014

పెదవులపై చిరునవ్వు అడిగేనే
ఎవరు ఇచ్చెనని,
ఎద చాటు వన్నెలు అడిగినే,
ఈ పరవశం ఎందుకని,
కనుల చాటు ఊహ అడిగినే,
కోరిక చెప్పవెందుకని?
వరదై పొంగుతోంది కన్నీరు
వలచిన నీ కోసం,
వయస్సుతో వచ్చిన అందాలు
వలపులు వెదజల్లుమంటుంటే
వర్షిస్తున్న కనులు అడిగెను
ఎవరికోసమని ..
ఏమని చెప్పను ఈ
హృదయ బాధ
మనసే లేని మనిషికి
మనసిచ్చాననా ???

మిత్రమా ...
నీ మైత్రితో
వర్షిస్తున్న నా కనులకి,
ఆనందాల దరి చూపిస్తావా!
ఆలోచనలతో నా మనసుకి
ఆహ్లాదాన్ని అందిస్తావా !!!
కనులలో ఉన్న నీ రూపము
కన్నీటితో కరిగి పోతుందనుకుంటే
నిలుపనా ఆ కన్నీరు
శాశ్వతంగా నా నయనాలలో
వలచిన హృదయానికి
వర్ణించలేని బాధనిచ్చి
నువ్వు పొందిన సంతోషము
అజరామమా!!!
నీ ఎదుట పడలేక
                  నా మనసిక
లేఖనే రాసింది
               నీ కోసమేగా...
అక్షరాలలోని మృదువైన
               భావమికా....
నీ కనులలో
             వెలుగులేగా...
నీవు చూడగలవా
             నా మనసులోతునిక
నిలుపవా నను నీ
            బాహువులలో త్వరగా !!!

Friday, 19 September 2014

పదాలు కరువే అయిన
నీ మీద ప్రేమ తరగనిది...
ఎద లోతుల సవ్వడులు వెతికినా
నాలో ప్రతి జ్ఞాపకం నీది
ఎగసే అలలు ఎంత ఎదిగిన
చివరికి పయనము సంద్రానికే..
నీ మీద కోపం ఒక్క క్షణం అయిన
నా ఎదలోని బాధ కన్నీటి ధార...