Friday 17 October 2014

మరణం మనిషిని చూసి నవ్వుతుంది ..
తన నుంచి తప్పించుకోలేమని ..
నువ్వు నా పక్కనుంటే మరణం భయపడుతుంది,
నా చేరువలో రావడానికి ...
మరణిస్తానని తెలిసినా మనసు కోరుకుంటుంది ,
నీకై చిరునవ్వు చిందించాలని...
నీతో గడిపే రెండు క్షణాలు సమయం కోసం,
నా కనులు రెప్ప వెయ్యడం మర్చిపోయాయి ..
నీ బాహువులలో జీవితాంతం ఒదిగిపోవడం కోసం,
నా ఆలోచనల అంతరంగాలు మారిపోతున్నాయి ..
నీవు కరుణించవు అని తెలిసినా,
నా కనులు కలలని వదలడం లేదు...
నీ మోము సౌందర్యం చూచి జాబిలి చిన్నబోదా !
నీ కనుల వెలుగు ముందు వెన్నెల వెలవెలబోదా !
నీ పెదవుల పలుకులు విని కోయిల ఆశ్చర్యపోదా !
నీ ఆదరాల ఎరుపు చూసి సూర్యుడు విస్తుపోడా !
నీ అందమైన చిరునవ్వుకని వసంతం వచ్చిపోదా !
నీ కురుల నలుపు చూసి చీకటి రాబోదా !
ఏకాకినై
చీకటి వైపు చూస్తుంటే
గాలి లోని వెలుగువలె
స్నేహం మిణుకుమిణుకుమంటుంటే ..
జీవితం ఆలోచనలతో ఊగిసాలడుతుంది...
మనసే ముక్కలై...
నమ్మకం చచ్చిన వేళా,
ఒంటరితనం ఓటమివైపు
అడుగులేస్తుంటే...
మనసేమో విజయం వైపు చూపే
స్నేహానికై ఆరాటపడుతున్నది...

Saturday 11 October 2014

బంధం ....
ఉండాల్సింది మనుషుల మధ్య కాదు ..
అర్ధం చేసుకునే మనసుల మధ్య...
నిను కోరుకునే వాళ్ళు ఎందుకు కోరుతున్నారో
నాకు తెలియదు కానీ..
నేను మాత్రం నువ్వు మాట్లాడితే
నా పెదవులపై మెరిసే చిరునవ్వు కోసం కోరుకుంటున్నా...
నీకు నాకు నడుమున ఏముందో తెలియక పోవచ్చు,
కాని నిను గౌరవించే హృదయం మాత్రం నాలో ఉంది.
నిను పొందే హక్కు నాకు లేకపోవచ్చు కాని
నిను దూరం చేసుకునే ఉద్దేశ్యం మాత్రం నాలో లేదు...
అబద్దం,

బంధాన్ని బలపరుస్తుంది అనుకుంటే ..మనసుని వేధిస్తుంది
మరచిపోగలను అని చెప్పగలను కానీ మరువలేను.
మరచిపోతాను నా శ్వాస ఆగిపోయినపుడు
నీకు దూరం అవ్వాలి అనుకుంటున్నాను ..ఎందుకో తెలుసా
అబద్డంతో ఇమిడి ఉన్న బంధం బీటలు వారిన గోడ లాంటిది
ఏ క్షణాన కూలిపోతుందో తెలియదు
అది చూసి తట్టుకునే అంత  శక్తి నాకు లేదు..
నీలా ఏ భావం లేకుండా బ్రతికే మార్గం కూడా నాకు లేదు ..
అందుకే ఈ దూరం...
ప్రతి చినుకు మేనిపై
నాట్యమాడుతుంటే
తన చేతి స్పర్శలా ఉంది
కలకాదుగా ఇదీ
అతని కౌగిలిలో ఉన్నది ...

Friday 10 October 2014

వర్షం
ఎందుకో తనను దగ్గర
చేసినట్లు అనిపిస్తుంది
కారణాలు ఏవైతేనేం
నాలో ఆనందాలు నింపింది..
అది క్షణమే అని తెలిసిన
నా మనసు ఏదో బంధం
కోసం ఉవ్విలురుతుంది
వాస్తవమో కల్పితమో
మనసుకి హాయిగా ఉంది ...
నీ పెదవుల చిరునవ్వుల
వెనుక నే చిన్న కారణమై
నీ కనుల అందము
చాటున నే ఊహనై..
నీ తేనే మనసు
మాటున నే కోరికై,
వర్షించే నా కనులను నీ
నును వెచ్చని స్పర్శతో
ఆనందింపజేయవా....
సంగమం ..
నీ తనువు నా తనువుతో
మనసులు మాట్లాడుకుంటున్నాయి
మౌనమనే బాషతో
తడబడుతున్నాయి ..
నా అదరాలు నీ ఆదరాల స్పర్శతో
అలసిపోతున్నాయి..
నా కనురెప్పలు నీ కనుల చుంబనంతో ..
పొంగుతోంది ...
వెచ్చని శ్వాస వరద గోదావరిలా...
నీ స్వేదము రుచి ,
ఈ ఆనందపు అనుభూతి తీయనిది...
చిగురించిన తరువు అడిగినే
చిన్ననాటి గురుతులేవని
చెమ్మగిల్లిన కనులు చెప్పెనే
మనసు చాటున దాచినని..
విరబూసిన పూలు జల్లెనే,
కవ్వింతల అక్షింతలు,
చిరుగాలిలో వేడి తెలిపినే
నీ ఊపిరి నా చేరువ అయ్యెనని ....